ముగిసిన సాంస్కృతిక సమ్మేళనం
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి సాంస్కృతిక సమ్మేళనం శుక్రవారం ముగిసింది. ఇందులో యోగా, సంగీతం, నృత్యం, కథన కళ, చిత్రకళ, జానపద సంప్రదాయాలు, శిల్పకళ వంటి అనేక అంశాలు ప్రదర్శించారు. ఒకేవేదికపై వివిధ కళారూపాలను ప్రదర్శించడం విద్యార్థులకు కొత్త అనుభవాన్ని అందించింది. జర్నా మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా, కుమార్ మార్దూర్, మాండా సుధా రాణి మార్గదర్శకత్వంలో జరిగిన నాదయోగం విద్యార్థుల్లో ప్రశాంతత, ఆధ్యాత్మిక అభిరుచిని పెంపొందించాయి. చివరి రోజున నిర్వహించిన ప్రదర్శనలు యోగా, సంగీతం, నృత్యం, కథనకళ, ఫైన్ ఆర్ట్స్ నైపుణ్యాలను ఆవిష్కరించారు. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థుల శ్రద్ధ, వలంటీర్ల సేవా భావం, గురువుల అంకితభావాన్ని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ, అలాగే భారత ప్రభుత్వ విద్య, సాంస్కృతిక, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహించిన ఈ సమ్మేళనం ప్రతీ విద్యారిలో జ్ఞానం, అనుభవం, సాంస్కృతిక అవగాహన పెంపొందించాయన్నారు.
నాట్యమండలి వారితో మాట్లాడుతున్న
ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్
ఒగ్గుడోలు ప్రదర్శనలో కళాకారులు
మహిళా కళాకారిణి నృత్య రూపకం..
ముగిసిన సాంస్కృతిక సమ్మేళనం
ముగిసిన సాంస్కృతిక సమ్మేళనం


