తుది అంకం ముగిసింది
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామపంచాయతీ ఎన్నికల తుది విడత నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. చివరి రోజు సర్పంచ్, వార్డు స్థానాల కోసం అభ్యర్థులు భారీగా తరలిరావడంతో అర్ధరాత్రి వరకు స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. సాయంత్రం 5 గంటల్లోపు కేంద్రంలోకి వచ్చిన వారికి క్యూలైన్ టోకెన్లు అందించి దరఖాస్తులు స్వీకరించారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
నామినేషన్ల పర్వం చివరి రోజు కావడం.. అప్పటికే బుజ్జగింపుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 316 మంది నామపత్రాలు అందజేయగా, వార్డు స్థానాలకు 860 మాత్రమే దాఖలు చేశారు. చివరి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభ్యర్థులు కేంద్రాలకు తరలివచ్చారు. అధికారులు సైతం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నా.. తలకు మించిన భారమైంది.
నేడు పరిశీలన..
గ్రామపంచాయతీ ఎన్నికల తుది విడత నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. శనివారం పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 9న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు అభ్యర్థుల జాబితా, గుర్తులను కేటాయిస్తారు. డిసెంబర్ 17న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. తర్వాత కౌంటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.


