భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలి
నిర్మల్‌టౌన్: భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని డీజీపీ శివధర్‌రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్, అభివృద్ధి, శాంతి భద్రతలు, పరిపాలన సామర్థ్యంపెంపు, స్మార్ట్ గవర్నెన్స్ లాంటి ముఖ్యంశాలపై అన్ని జిల్లాల పోలీస్ అధికారులతో సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో జిల్లా ఎస్పీ జానకీషర్మిల, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా పాల్గొన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న మంచి పద్ధతులు, భద్రతాచర్యలు, ప్రజాసేవల విస్తరణకు చేపడుతున్న వినూత్న విధానాలు ఎస్పీ వివరించారు. తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టే దిశగా పోలీస్‌శాఖ పాత్ర నూతన వ్యూహాలు సాంకేతిక ఆధారిత సేవల విస్తరణ వంటి అంశాలపైనా చర్చించారు.
ఏఎస్పీకి వీడ్కోలు
నిర్మల్‌టౌన్: భైంసా ఏఎస్పీగా విధులు నిర్వర్తించి కొత్తగూడెంకు బదిలీ అయిన అవినాష్ కుమార్‌కు ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ జానకీషర్మిల ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పూలమాల శాలువాతో సత్కరించారు. భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్ సమర్థవంతంగా పనిచేశారని తెలిపారు. నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


