అక్రమ నిర్మాణాలపై చర్యలు | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలపై చర్యలు

Published Sat, Apr 13 2024 11:55 PM

-

ఖానాపూర్‌: ఖానాపూర్‌ పట్టణ పరిధిలో అక్రమంగా నిర్మాణాలు చేసినా, వెంచర్లు వేసినా చర్యలు తప్పవని మున్సిపల్‌ చైర్మన్‌ చిన్నం సత్యం హెచ్చరించారు. పట్టణంలో శనివారం మాట్లాడారు. పట్టణంలో అనుమతులు లేకుండా వెంచర్లను ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇళ్ల నిర్మాణాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మున్సిపాలిటీలో లోటు బడ్జెట్‌ కారణంగానే మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌ అక్రమ నిర్మాణాలు, వెంచర్లపై కొరడా ఝళిపిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దుష్ప్రచారం చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement