బీఆర్‌ఎస్‌ ఖాళీ కావడం ఖాయం | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఖాళీ కావడం ఖాయం

Published Fri, Apr 12 2024 1:15 AM

కాంగ్రెస్‌లో చేరిన వారితో శ్రీహరిరావు
 - Sakshi

● డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు ● కాంగ్రెస్‌లో పలువురి చేరిక

నిర్మల్‌చైన్‌గేట్‌/సోన్‌: కాంగ్రెస్‌ గాలికి నిర్మల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ఖాళీ కావడం ఖాయమని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. సోన్‌ మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు గురువారం ఆ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. వారికి శ్రీహరిరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పేదలకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయఢంకా మోగించేలా పని చేయాలని సూచించారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో బీఆర్‌ఎస్‌ సోన్‌ మండల అధ్యక్షుడు మొహినుద్దీన్‌తో పాటు వివిధ గ్రామాల మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, బీఆర్‌ఎస్‌ నాయకులు మధుకర్‌రెడ్డి, రాజనర్సింహారెడ్డి, బర్మదాసు, శ్రీనివాస్‌గౌడ్‌, లింగన్న, శివరాం, సహారా భాను, గడ్చంద పోశెట్టి, మౌలానా, విలాస్‌, తోకల మల్లయ్య, దేశెట్టి భాస్కర్‌, వేంపల్లి ప్రవీణ్‌, అర్జున లింగన్న, రామచందర్‌రెడ్డి, వెంకట నరసయ్య, నాంపల్లి ప్రభాకర్‌, గంట మహేందర్‌, సీహెచ్‌.శ్రీధర్‌, గుండారం స్వామి, పసుపుల రాజేశ్వర్‌, చౌటుపల్లి మహేందర్‌, దర్శనం సుధాకర్‌, బాస పెద్ద ముత్తన్న, సర్వేష్‌ ఉన్నారు.

13న బూత్‌ స్థాయి సమ్మేళనం

నిర్మల్‌చైన్‌గేట్‌: ఈ నెల 13న ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో బీజేపీ బూత్‌ స్థాయి నేతల సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ సమ్మేళనానికి నిర్మల్‌ జిల్లాలోని ప్రతీ బూత్‌ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, బీఎల్‌ఏలు, ఆపై స్థాయి నాయకులు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు.

బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో..

నిర్మల్‌టౌన్‌: మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటా నికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ ఉప్పు కృష్ణంరాజు మాట్లాడుతూ.. భారతదేశంలో బడు గు బలహీనవర్గాలకు చెందిన ప్రజలు ఆయన కృషితోనే అన్నిరంగాల్లో ముందుకు సాగుతున్నారన్నారు. కార్యక్రమంలో కన్వీనర్లు సిరికొండ రమేశ్‌, కత్రోజ్‌ అశోక్‌, కొట్టూరి కిషన్‌, కార్యనిర్వహణ అధ్యక్షుడు జీవన్‌, ఏంబడి చంద్రశేఖర్‌, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పూలేకు నివాళులర్పిస్తున్న కృష్ణంరాజు
1/1

పూలేకు నివాళులర్పిస్తున్న కృష్ణంరాజు

Advertisement
 
Advertisement