తాగునీటికి ఇబ్బంది పడకుండా చూడాలి | Sakshi
Sakshi News home page

తాగునీటికి ఇబ్బంది పడకుండా చూడాలి

Published Thu, Apr 11 2024 8:05 AM

వీసీలో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు - Sakshi

● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

నిర్మల్‌చైన్‌గేట్‌: వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలు ఏర్పడితే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. నీటి సమస్యలు పరిష్కరించేందుకు ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు టార్పాలిన్లు రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అత్యవసర పనులకు సంబంధించిన అంచనా వ్యయాలను సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని బడుల్లో కమిటీలను ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలను తెరవాలని ఆదేశించారు. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, అదనపు కలెక్టర్‌ కిషోర్‌ కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎంహెచ్‌వో ధనరాజ్‌, డీఈవో రవీందర్‌రెడ్డి, మిషన్‌ భగీరథ ఏఈ సందీప్‌, డీఎస్వో నందిత, సివిల్‌ సప్లై డీఎం శ్రీకళ, మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement