ఆ ఊర్లో అబ్బాయిలు మాకొద్దంటున్న అమ్మాయిలు.. కారణం తెలిస్తే మైండ్‌ బ్లాక్‌ అవ్వాల్సిందే!

Village Of Bachelors: Girls Not Interested To Marry Men Of This Village Up - Sakshi

లక్నో: ఓ సినిమాలో పెళ్లి కాని ప్రసాద్‌ అని హీరోని ఆటపట్టిస్తుంటారు గుర్తుందా.  సరిగా అదే పరిస్థితిని ఆ గ్రామంలోని యువకులు ఎదుర్కుంటున్నారు. అక్కడి మగ పిల్లలు యువకులుగా మారి ఆ దశ నుంచి బ్రహ్మచారులుగా మారుతున్నారు తప్ప భర్తలుగా మారలేకపోతున్నారు. ఇంతకీ ఆ ఊరేంటి, అక్కడి యువకులకు వివాహం ఎందుకు కావడం లేదనే కారణం తెలిస్తే షాక్ అవుతారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలోని కత్రా ప్రాంతంలోని పురైనా గ్రామంలో వరుడిగా మారాల్సిన యువకులు అంకుల్స్‌గా మారుతున్నారు.

వివాహం కోసం వేట
1,000 కంటే తక్కువ జనాభా ఉన్న ఈ గ్రామంలో యువకులకు 30 దాటినా పెళ్లి కావడం లేదు. వాళ్లు ఎక్కడ తిరిగినా, ఎవరిని అడిగినా అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యులు ఈ గ్రామంలోని అబ్బాయితో పెళ్లికి అంగీకరించడం లేదు. దీంతో చేసేదేమి లేక ఈ బ్రహ్మచారులు వధువుల వేట కొనసాగిస్తున్నారు. అక్కడి ఈ పరిస్థితికి కారణమేమంటే.. ఆ ఊరికి ఇప్పటి వరకు కరెంట్ సదుపాయం లేదు. మీరు విన్నది నిజమే. దేశంలో చాలా గ్రామాలు అభివృద్ధి వైపు పరుగులు పెడుతూ పట్టణాలను తలపిస్తుంటే పురైనా గ్రామానికి మాత్రం కనీసం విద్యుత్ సరఫరా లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు లేకపోవడంతో ఆ గ్రామం ఇప్పటికీ చాలా వెనుకబడి ఉంది.

అందుకే ఈ ఊరిలో ఉన్న యువకులకు ఎవరికీ తన కూతురిని ఇచ్చి వివాహం జరిపించేందుకు ముందుకు రావడం లేదు. కరెంట్ లేకపోవడం ఒక్కటే సమస్య కాదు.. గ్రామానికి కరెంటు లేకపోవడంతో నీటి సమస్య కూడా ఉంది. దీంతో తాగు నీటి కోసం గ్రామంలోని మహిళలు చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. నిత్యావసరమైన కరెంట్,నీటితో పాటు ..ఇతర మౌలిక వసతులకు కూడా తాము చాలా దూరంలో ఉన్నట్లు ఆ  గ్రామ ప్రజలు వాపోతున్నారు.  సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారి జీవితాల్లో వెలుగు వస్తుందని ఆశించిన ఆ గ్రామ ప్రజలు ఇంకా చీకటిలోని బతుకుతున్నారు.

చదవండి: రోడ్డుపై కనికట్టు..బొగ్గు, చాక్‌పీస్‌లతో ఒక కాలువను సృష్టించినా! వీడియోలతో

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top