మాములు భార్య కాదు.. భర్త లైంగిక దాడి చేస్తుండగా వీడియో తీసి..

భర్తకు ఆమె నచ్చింది.. భార్యతో చెప్పి ఇంటికి పిలిచి గదిలో.. అలా చేయడం తప్పు అని చెప్పాల్సిన భార్యే.. భర్త పక్కనుండి మరీ తప్పు చేయించింది. అతడు ఓ మైనర్‌పై అత్యాచారం చేస్తుండగా ఆమె పక్కనే ఉండి వీడియోలు తీసి ఎంకరేజ్ చేసింది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. బదౌన్‌లో ఈనెల 12వ తేదీన ఈ ఘటన జరిగింది. కాగా, బదౌన్‌లో ఓ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. వీరి ఇంటి పక్కన ఉండే ఇంట్లో ఓ మైనర్ ఉంది. తెలిసిన వారే కావడంతో తరచుగా ఆమె వీరి ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో సదరు మహిళ భర్త.. మైనర్‌పై పడింది. ఇందుకు ఓ ప్లాన్ వేశాడు. లైంగిక దాడి కోసం తన భార్య సాయం కోరాడు. అందుకు ఆమె అడ్డుచెప్పకుండా.. సరేనని ఒప్పుకుంది. దీంతో, ఆమె.. మైనర్‌ను ఇంటికి పిలిచింది. ఇంట్లోకి రాగానే భర్త.. ఆమెను గదిలో బంధించి అత్యాచారం చేశాడు.
ఈ సందర్భంగా భార్య.. వారి పక్కనే ఉండి సెల్‌ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీసింది. అనంతరం.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. కాగా, రెండు రోజుల తర్వాత.. నిందితులు చెప్పినట్టగానే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో, భయపడిన బాధితురాలు.. జరిగిన విషయాన్ని పేరెంట్స్ చెప్పింది. ఈ క్రమంలో వారు పోలీసులను ఆశ్రయించగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: మోదీ ఇలాకాలో నూపుర్ శర్మ పోస్టు కలకలం.. వ్యాపారిని చంపేస్తామంటూ బెదిరింపులు
మరిన్ని వార్తలు