23 నుంచి మోదీ  విదేశీ పర్యటన  | PM Narendra Modi to visit UK, Maldives from July 23–26 | Sakshi
Sakshi News home page

23 నుంచి మోదీ  విదేశీ పర్యటన 

Jul 20 2025 4:45 AM | Updated on Jul 20 2025 4:45 AM

PM Narendra Modi to visit UK, Maldives from July 23–26

న్యూఢిల్లీ:  ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23 నుంచి 26వ తేదీ దాకా యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే), మాల్దీవ్స్‌ దేశాల్లో పర్యటించనున్నారు. రెండు దేశాలతో దౌత్య, వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. మోదీ తొలుత ఈ నెల 23, 24న యూకేలో పర్యటిస్తారు. 

అత్యంత కీలకమైన ఇండియా–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై సంతకం చేస్తారు. రక్షణ రంగంలో పరస్పర సహకారంపై యూకే ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌తో చర్చలు జరుపుతారు. అలాగే ఈ నెల 25, 26న మాల్దీవ్స్‌లో మోదీ పర్యటన కొనసాగనుంది. మాల్దీవ్స్‌ 60వ జాతీయ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement