ఒమిక్రాన్‌ వేరియంట్‌: కేంద్రం కీలక నిర్ణయం

PM Narendra Modi Address Nation About Omicron Variant - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఒమిక్రాన్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. భారత్‌లో ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శనివారం జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ఒమిక్రాన్‌ వేరియంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ''ఒమిక్రాన్‌ వల్ల ప్రపంచ దేశాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించాలి. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి.

చదవండి: Omicron variant of COVID-19: లాక్‌డౌన్‌పై ఆరోగ్య శాఖ కీలక వ్యాఖ్యలు

దేశంలో 18 లక్షల ఐసోలేషన్‌ బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. 5 లక్షల ఆక్సిజన్‌ బెడ్లతో పాటు లక్షా 40 వేల ఐసీయూ బెడ్లు రెడీగా ఉన్నాయి. వ్యాక్సిన్‌ విషయంలో భారతదేశం ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. జనవరి 3 నుంచి 15-18 మధ్య పిల్లలకు టీకా పంపిణీ చేస్తాం. ఇక జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు బూస్టర్‌ డోస్‌ టీకా ఇస్తాం.'' అంటూ తెలిపారు. అదేవిధంగా 60 ఏళ్లు దాటిన వారికి కూడా ప్రికాషన్‌ డోస్‌ అందిస్తామని ప్రధాని పేర్కొన్నారు. త్వరలోనే డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ను కూడా  అందుబాటులోకి తీసుకురానున్నామని స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top