నిబ్బీల ఫైట్‌: ప్రియుడి కోసం ఇద్దరమ్మాయిల గ్యాంగ్‌వార్‌, పోలీసుల రాకతో..

Nibbi Fight Viral Video:  Uttarakhand Girls Fight Over Boy Friend  - Sakshi

వైరల్‌: ఇలాంటివి చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందుకే ఇంటర్నెట్‌లో నెటిజన్స్‌ అంతగా ఆకట్టుకోగలుగుతాయి. బాయ్‌ఫ్రెండ్‌ తనవాడని ఒకరు.. తనకే సొంతమంటూ మరొకరు.. ఇద్దరమ్మాయిలు గ్యాంగ్‌వార్‌కి దిగారు. పట్టుమని పదహారేళ్లు కూడా నిండని అమ్మాయిలు తమ తమ స్నేహితురాళ్లతో నడిరోడ్డు మీదే తన్నుకున్నారు. జుట్లు పట్టుకుని నడిరోడ్డుపై  బాహాబాహీకి దిగారు.

ఆపై తమ తమ గ్యాంగ్‌ సభ్యులతో కర్రలతో దాడి చేసుకున్నారు. బూతులు తిట్టుకుంటూ నానా హంగామా సృష్టించారు. ఉత్తరాఖండ్‌ హల్ద్వానీలోని హీరా నగర్ చౌకీ ప్రాంతంలోని పోలీస్ యోగా పార్క్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రేమికుడి విషయంలో గొడవ పడ్డ ఇద్దరు అమ్మాయిలకు మద్దతుగా వాళ్ల వాళ్ల గ్యాంగ్‌ సభ్యులు తోడయ్యారు. ఇద్దరినీ తన్నిన తర్వాత ఒకరిపై ఒకరు కర్ర దెబ్బల వర్షం కురిపించారు. ఆఖర్లో.. 

‍స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చారు. దీంతో ఆ రెండు గ్యాంగ్‌ల అమ్మాయిలు అక్కడ నుంచి పరారయ్యారు. ప్రస్తుతం నిబ్బీ లవ్‌స్టోరీగా ఇంటర్నెట్‌లో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. చూడాలి.. దీని మీద మీమ్స్‌ ఏ రేంజ్‌లో వస్తాయో మరి!.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top