మహారాష్ట్రలో 9,566 మంది పోలీసులకు కరోనా

ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ కరోనాతో పోరాడుతున్న పోలీస్ శాఖలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఆదివారం వరకు 9,566 మంది పోలీసులకు కరోనా సోకినట్లు సంబంధిత అధికారలు వెల్లడించారు.
కరోనా వైరస్ కారణంగా పోలీసు విభాగానికి చెందిన 103 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 9 మంది ఉన్నతాధికారులు, 94 మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం పోలీస్ శాఖలో 1,929 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు కరోనా బారి నుంచి 7,534 మంది పోలీసులు కోలుకున్నారు. కాగా మహారాష్ట్రలో ఇప్పటిదాకా 4 లక్షల 31వేలకు పైగా కేసులు నమోదు కాగా.. 15,316 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. (ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి