లిక్కర్‌ కేసు: ఎనిమిదోసారి సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు

Enforcement Directorate Issues 8th Summons To Delhi CM - Sakshi

ఢిల్లీ:  ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఎనిమిదో సారి సమన్లు జారీ చేసింది. మార్చి 4న హాజరుకావాలని మంగళవారం జారీ చేసిన సమన్లలో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీ లాండరింగ్‌ కేసులో ఇప్పటికే ఈడీ కేజ్రీవాల్‌కు ఏడు సార్లు సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఆయన వరుసగా ఏడు సార్లు ఈడీ విచారణనకు హాజరుకాకపోవటం గమనార్హం.

ఇక.. ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఈడీ ఇన్నిసార్లు సమన్లు జారీ చేయటం రికార్డుగా తెలుసోంది. సమన్లు జారీ చేసిన ప్రతిసారి తనను తప్పుడు కేసులో ఇరికించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపణలు చేస్తున్నారు.   

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top