మోల్నుపిరావిర్‌ను కోవిడ్‌ చికిత్సలో చేర్చడం లేదు

Covid: Molnupiravir Not Included Clinical Management Protocol - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ చికిత్సలో కొత్త ఆయుధంగా భావిస్తున్న మోల్నుపిరావిర్‌ మాత్రను ప్రస్తుతం భారత్‌లో కోవిడ్‌ చికిత్స విధానంలో చేర్చడం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పునరుద్ఘాటించింది. ఐసీఎంఆర్‌ కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సోమవారం సమావేశమైంది. మోల్నుపిరావిర్‌తో లాభనష్టాలను బేరీజు వేసింది. ప్రస్తుతానికి మోల్నుపిరావిర్‌ను కోవిడ్‌ చికిత్స ప్రొటోకాల్‌లో చేర్చకూడదని నిర్ణయించింది.

చదవండి: కరోనా థర్డ్‌ వేవ్.. వైరస్‌ నీడలో వీఐపీలు

దీనివల్ల పెద్దగా లాభం లేదని, అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, పుట్టబోయే బిడ్డల్లో వైకల్యానికి దారితీస్తుందని పేర్కొంది. మోల్నుపిరావిర్‌కు  డీఆర్‌జీఐ ఇటీవల పరిమిత వినియోగానికి ఓకే చెప్పింది. దీంతో మెర్క్‌ ఔషధ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న 13 భారత ఫార్మా సంస్థలు దీని ఉత్పత్తిని ప్రారంభించాయి. ఓ ప్రభుత్వ సంస్థ అనుమతులిచ్చి మరో సర్కారీ సంస్థ దీని వాడకం ప్రమాదమని చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top