
వంద శాతం ఉత్తీర్ణతపై శ్రద్ధ వహించాలి
కోస్గి రూరల్: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమ బోధన అందించాలని, పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ అన్నారు. శనివారం గుండుమాల్ ఆదర్శ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఉపాధ్యాయులతో సమావేశమై మాట్లాడుతూ.. ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు తమ బాధ్యతలు గుర్తిస్తే విద్యార్థులకు చదువుపై శ్రద్ద పెరుగుతుందన్నారు. మాడల్ స్కూళ్లలో రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారని కాని పదో తరగతి ఉత్తీర్ణత 85 శాతం మాత్రమే వచ్చిందని, కేజీబీవీలలో కాంట్రాక్టు ఉపాధ్యాయులు 99 శాతం ఫలితాలను రాబడుతున్నారని వివరించారు. పాఠశాలలోని ల్యాబ్‌ల నిర్శహణ, పరిసరాలు పరిశభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహించాలన్నారు.