
ప్రభుత్వం గుర్తించాలి..
23 ఏళ్లుగా గోపాలమిత్రలుగా పనిచేస్తూ చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పశు సంవర్ధకశాఖలో ఖాళీగా ఉన్న అటెండర్ పోస్టుల్లో సీనియర్ గోపాలమిత్రలకు అవకాశం కల్పించాలి. కనీస వేతనం రూ. 24వేలు అందించాలి. గోపాలమిత్రల సేవలను ప్రభుత్వం గుర్తించాలి.
– మాశప్ప, గోపాలమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు
ప్రతినెలా వేతనం అందించాలి..
పాడి రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పశుసంవర్ధక శాఖ ఆదేశాల మేరకు పశువైద్య సేవలు అందిస్తున్నాం. పనికి తగిన వేతనాలు మాత్రం పొందలేకపోతున్నాం. ప్రభుత్వం గోపాలమిత్రలకు వేతన బాధ తీర్చాలి. ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు అందించాలి.
– మల్లేష్, గోపాలమిత్రల సంఘం జిల్లా కార్యదర్శి
●

ప్రభుత్వం గుర్తించాలి..