
బెస్ట్ బౌలర్‌గా దివ్యరాథోడ్
వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మామిడిమాడకు చెందిన దివ్యరాథోడ్ ఇటీవల ఇంట్రా డిస్ట్రిక్ట్ వుమెన్ క్రికెట్ లీగ్‌లో బెస్ట్ బౌలర్‌గా ఎంపికై ంది. రెండు లీగ్ మ్యాచుల్లో 7 వికెట్లు తీసి ప్రతిభచాటింది. వనపర్తిలోని గిరిజన గురుకులంలో చదువుతున్న దివ్యరాథోడ్ కోచ్ మన్నాన్ వద్ద రెండేళ్లగా క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటోంది. గత ఏడాది ఖమ్మంలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 రాష్ట్రస్థాయి, హరియాణాలో జరిగిన జాతీయస్థాయి మహిళా క్రికెట్ టోర్నీలో ఆడింది. ఫాస్ట్‌బౌలర్‌గా గుర్తింపు పొంది జాతీయ మహిళా జట్టుకు ఎంపికవుతానని అంటోంది దివ్యరాథోడ్.