
ఓటరు నమోదు బాధ్యతాయుతంగా చేపట్టాలి
కోస్గి రూరల్: రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల ఓటరు నమోదును బాధ్యతాయుతంగా చేపట్టాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్, ఎన్నికల నిర్వహణ అధికారి లింగ్యానాయక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బీఎల్‌ఓలకు శిక్షణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 1 తేదీ నుంచి ఓటరు నమోదు ప్రారంభమైందని, కొత్త ఓటరు నమోదు, మార్పు చేర్పులు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్పు చేసుకోవడం, ఎపిక్ కార్డు జనరేషన్, ఫొటో మార్పిడి, పేర్లు సవరించడం, చనిపోయిన వారిని జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. 1200 వందల ఓట్లకు పైబడిన ప్రాంతాలు 6 ఉన్నాయని అక్కడ నూతనంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల తహసిల్దార్ బక్క శ్రీనివాసులు టైనర్‌లు రవికుమార్, హక్ తదితరులు ఉన్నారు.