
మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు
నారాయణపేట: జిల్లాలోని మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులకు హైదరాబాద్ శిల్పారామంలోని ఇందిరా మహిళాశక్తి బజార్‌లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించి.. ఆర్థిక స్వావలంబనకు తో డ్పాటు అందిస్తామని ప్రత్యేకాధికారిణి సౌజన్య అన్నారు. గురువారం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి తన బృందంతో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళ లు తయారుచేసిన వెదురు ఉత్పత్తులు, ఎర్రకోట, బంకమట్టి ఆభరణాలు, చిక్కిళ్లు, లడ్డూలు, ఇ తర స్వీట్స్, నారాయణపేట కాటన్ చీరలు, దోతీలు, చట్నీలు, నూనెలు, పల్లీ, నువ్వులు, కొ బ్బెర పట్టీలు, సబ్బులు, అగర్‌బత్తీలు, షాంపు లు, కలంకారి వస్త్రాలు, తాటి ఆకుల వస్తువులు, జూట్ బ్యాగ్‌లు, కారంపొడి, జొన్నరొట్టెలు తదితర వాటిని పరిశీలించారు. శిల్పారామంలో ఏ ర్పాటుచేసిన మహిళాశక్తి బజార్‌ను పరిశీలించి.. తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, కార్యదర్శి సుజాత, కోశాధికారి అంజమ్మ, డీపీఎంలు గోవిందు, మాసన్న, జయన్న, సీసీలు భీమయ్య, శ్రీనివాస్, కతాల్, గొల్ల రాము, అకౌంటెంట్ మహేశ్వరి పాల్గొన్నారు.