
ట్రాన్స్‌కో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
కోస్గి: విద్యుత్ కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న తీరుపై సమగ్ర ఆధారాలతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ట్రాన్స్‌కో అధికారుల లీలలు’ కథనంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయమై ట్రాన్స్‌కో ఎస్‌ఈ వెంకటరమణ స్పందిస్తూ.. అధికారుల మధ్య సమన్వయ లోపమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించి, కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. కాగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో కలెక్టర్ స్వయంగా పర్యటిస్తూ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశిస్తుండగా.. స్థానిక అధికారులు మాత్రం ఇష్టారీతిగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశం

ట్రాన్స్‌కో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం