
‘మాగనూర్‌ను ఎడారి చేయొద్దు’
మాగనూర్: మండల కేంద్రం శివారు ప్రాంతంలో ఉన్న వాగు నుంచి ఇసుకను తరలించి మాగనూర్ ఎడారి చేయొద్దని గ్రామస్తులు మంగళవారం ఆందోళనకు దిగారు. మండలంలో 24 కిలో మీటర్ల మేర వాగు ప్రవహిస్తున్నా.. అధికారులు, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్ మాగనూర్ సమీపంలో ఇసుక తవ్వడంపై మొండిగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. మండలంలో ప్రభుత్వ అనుమతులతో నడిచే రీచ్‌లు ఉన్నాయని, ఇసుకను అక్కడ నుంచి తీసుకువెళ్లాలని కోరుతున్నా తమ బాధ ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇసుక తరలింపును నిలిపి వేయాలని కోరుతూ మంత్రి వాకిటి శ్రీహరికి విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే పోలీస్ బందోబస్త్‌తో ఇసుక తరలించేందుకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
అధికారులతో వాగ్వాదం
మంగళవారం ఇసుక తరలించేందుకు వాగులోకి టిప్పర్లు రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా వాగు వద్దకు చేరుకొని సుమారుగా 4 గంటల పాటు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ పనుల కోసం ఇసుక తరలిస్తున్నారని, అందుకు ప్రజలు సహకరించాలని తహసీల్దార్ నాగలక్ష్మి, ఎస్‌ఐ అశోక్‌బాబు గ్రామస్తులను కోరారు. ఈ మేరకు గ్రామస్తులు, రైతులు మాట్లాడుతూ తమకు రెండు రోజుల సమయం ఇవ్వాలని, మరోసారి సమావేశం నిర్వహించి మంత్రిని కలిసి ఇసుక రీచ్‌ను మరో చోటుకు మార్చాలని విన్నవిస్తామన్నారు. దీంతో స్పందించిన అధికారులు రీచ్‌లోకి వచ్చిన టిప్పర్ల వరకు ఇసుక తరలిస్తామని, రెండు రోజుల్లో సమస్య కొలిక్కి వచ్చేందుకు అందరూ సహకరించాలన్నారు. లేని పక్షంలో ఇక్కడి నుంచే ఇసుక తరలిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
మరోసారి ఇసుక తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు
తీరు మార్చుకోని పోలీసులు, అధికారులు