సోలార్‌ ప్రాజెక్టులకు భూములను గుర్తించండి | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ ప్రాజెక్టులకు భూములను గుర్తించండి

Jun 9 2026 8:52 AM | Updated on Jun 9 2026 8:52 AM

కర్నూలు(సెంట్రల్‌): పశ్చిమ ప్రాంతంలో సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు భూములను గుర్తించాలని ఎకై ్సజ్‌, గనుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, తిరుపతి ఎకనామిక్‌ రీజియన్‌ శాఖ సీఈఓ ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు. సోమవరం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధి, దార్శనికతపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులోని మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని తిరుపతి ఎకనామిక్‌ రీజియన్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జేసీ నూరుల్‌ ఖమర్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, పరిశ్రల శాఖ జీఎం అశోక్‌కుమార్‌, ఏపీఐఐసీ అధికారి సందీప్‌, ఎయిర్‌పోర్టు డైరక్టర్‌ విద్యా సాగర్‌, సీపీఓ భారతి, విద్యుత్‌ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్‌, డీడీ మైన్స్‌ నాగిని పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement