సబ్‌జైల్‌ పెట్రోల్‌ బంకులో రూ.74లక్షల అవినీతి | - | Sakshi
Sakshi News home page

సబ్‌జైల్‌ పెట్రోల్‌ బంకులో రూ.74లక్షల అవినీతి

Jun 9 2026 8:52 AM | Updated on Jun 9 2026 8:52 AM

ఆడిట్‌లో నిర్ధారణ

పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

బనగానపల్లె: బనగానపల్లెలోని సబ్‌జైల్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంకులో రూ.74లక్షల అవినీతి జరిగినట్లు ఆదివారం సాయంకాలం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. జైల్‌ సూపరింటెంట్‌ యోగేష్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. వివరాలు.. సబ్‌ జైల్‌ ఆధ్వర్యంలో 2021 అగస్టులో పెట్రోల్‌బంకు ఏర్పాటు చేశారు. హెడ్‌ఆఫ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో 2021 అగస్టు నుంచి 2026 మే చివరి వరకు జరిగిన అడిట్‌లో పెట్రోల్‌ బంకులో రూ.74లక్షల అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. సబ్‌జైల్‌లో పనిచేయు హెడ్‌వార్డెన్‌ రామచంద్రారెడ్డి పెట్రోల్‌ బంకుకు చెందిన అన్ని లావాదేవీలు చూసుకునే వారు. ఇతనే అవినీతికి పాల్పడినట్లు సంబంధిత ఉన్నతాధికారులు గుర్తించారు. అక్కడ పనిచేసే బాయ్‌ల ద్వారా ఆన్‌లైన్‌ ద్వారా వచ్చే డబ్బును సబ్‌జైల్‌కు చెందిన పెట్రోల్‌బంకు అకౌంట్‌లో డిపాజిట్‌ చేయకుండా తన పర్సనల్‌ అకౌంట్‌లో జమ చేసుకున్నట్లు ఆడిట్‌లో నిర్ధారించారు. ఈ మొత్తాన్ని అతను కొద్ది రోజులకు పర్సనల్‌ అకౌంట్‌ నుంచి కూడ డ్రా చేసి స్వాహా చేశాడు. రామచంద్రారెడ్డిపై సంబందిత ఉన్నతాధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement