తుగ్గలి: జొన్నగిరి సమీపంలోని గోల్డ్ మైనింగ్ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ మైనింగ్‌శాఖ చీఫ్ సెక్రటరీ ముఖేష్‌కుమార్ మీనా సోమవారం సందర్శించారు. జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిట్‌డ్ ఇండియా గోల్డ్ మైనింగ్ కంపెనీ అధ్వర్యంలో జొన్నగిరి సమీపంలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు చాలా ఏళ్ల క్రితం గుర్తించారు. వివిధ పరిశోధనలు అనంతరం అక్కడ దాదాపు రూ. 500 కోట్లతో నూతనంగా ప్లాంట్ ఏర్పాటు చేశారు. గోల్డ్ మైనింగ్ కంపెనీలో బంగారం ఉత్పత్తి కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ ప్రారంభం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలో వచ్చే అవకా శం ఉండటంతో చీఫ్ సెక్రటరీగా పర్యటించినట్లు తె లుస్తోంది. ఈ సందర్భంగా ఆయన కంపెనీ ప్రతినిధులు, ఉద్యోగులతో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యం, పని చేస్తున్న సిబ్బంది వివరాలును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ ఓబులేష్, డీఎస్పీ వెంకటరామయ్య, తహసీల్దార్ రవి, కంపెనీ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.


