గోస్పాడు: బాబానగర్ గ్రామం వద్ద సోమవారం లక్ష్మీనిషాద్ (28) అనే మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన కబీర్‌దాస్ జిల్లా బందర్ గ్రామానికి చెందిన దంపతులు లక్ష్మినిషాద్, పవన్‌లు ఏడాదిన్నర నుంచి బాబానగర్ వద్ద గురురాజ స్కూల్‌లో బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో వారికి కేటాయించిన గదిలో ఆమె నిద్రించేందుకు ఉపక్రమించింది. అయితే బయటకు వెళ్లిన భర్త పవన్ తిరిగి వచ్చి చూడగా ఎటువంటి కదలిక లేకుండా పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే చికిత్స నిమిత్తం 108లో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.


