చంద్రబాబు సర్కారు తీసుకున్న అనాలోచితన నిర్ణయాన్ని జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నష్టమంటూ ప్రజలు ఊరూరా సంతకం చేసి మరీ చెబుతున్నారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్ | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కారు తీసుకున్న అనాలోచితన నిర్ణయాన్ని జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నష్టమంటూ ప్రజలు ఊరూరా సంతకం చేసి మరీ చెబుతున్నారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్

Dec 8 2025 7:41 AM | Updated on Dec 8 2025 7:41 AM

చంద్ర

చంద్రబాబు సర్కారు తీసుకున్న అనాలోచితన నిర్ణయాన్ని జనం త

బాబు మోసం చేశాడని ప్రజలు గ్రహించారు

బొమ్మలసత్రం: పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో 5 కళాశాలల నిర్మాణం పూర్తి చేసి పేద విద్యార్థులకు మెడికల్‌ సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగతా 12 కళాశాలలను పూర్తి చేసి పూర్తిస్థాయిలో విద్యార్థులకు మెడికల్‌ సీట్లను అందించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మహా సంకల్పంతో మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లారు. అయితే 2024 ఎన్నికల్లో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరిస్తూ కుట్ర పన్నింది. అసంపూర్తిగా ఉన్న మెడికల్‌ కళాశాలను పూర్తి చేయకుండా పీపీపీ పేరుతో కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు అడుగులు వేసింది. దీన్ని నిరసిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3.83 లక్షలకు పైగా ప్రజలు సంతకాలు చేశారు. ఊరూరా ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మరో రెండు రోజుల్లో కార్యక్రమం పూర్తి కానున్న నేపథ్యంలోసంతకాల రూపంలో ప్రజాగ్రహం వెలువడనుంది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ప్రజలు చేసిన సంతకాల ప్రతులు త్వరలో గవర్నర్‌ చెంతకు చేరనున్నాయి.

ఊరూరా అనూహ్య స్పందన..

ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గత అక్టోబర్‌ నెల 10వ తేదీన ప్రారంభమైన కోటి సంతకాల కార్యక్రమానికి ఊరూరా విశేష స్పందన కనిపిస్తోంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, అనుబంధ విభాగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడంతో పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం కనిపించింది. దాదాపు రెండు నెలల పాటు వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నంద్యాల, శ్రీశైలం, పాణ్యం, ఆళ్లగడ్డ, డోన్‌, బనగానపల్లె, నందికొట్కూరు నియోజకవర్గాల్లో దశల వారీగా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించారు. ప్రజా ఉద్యమంటూ తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. నిరసనల్లో మహిళలు, విద్యార్థులు, యువకులు వేలాదిగా పాల్గొన్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వెనుకడుగు వేయలేదు.

జిల్లాలో సంతకాల సేకరణ ఇలా

● నంద్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా పూర్తి కానుంది. పట్టణంలోని 42 వార్డులతో పాటు నంద్యాల, గోస్పాడు మండలాల్లో ఇప్పటి వరకు 40 వేల మంది నుంచి సంతకాలు సేకరించారు.

● పాణ్యం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో 60 వేల మందికి పైగా ప్రజలు సంతకాలు చేసి కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించారు.

● ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాజీ ఎమ్యెల్యే గంగుల బిజేంద్రనాఽథ్‌రెడ్డి ఆధ్వర్యంలో 50 వేల మందికి పైగా ప్రజలు సంతకాలు చేసి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు యథావిధిగా కొనసాగేలా ప్రభుత్వానికి సంకేతాలు పంపారు.

● బనగానపల్లె నియోజకర్గంలో మాజీ ఎమ్యెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆధ్వర్యంలో సంతకాల శిబిరాల్లో 60 వేల మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

● డోన్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాఽథ్‌రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 60 వేల మంది ప్రజలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు.

● శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు పట్టణంతో పాటు 5 మండలాలల్లో నాయకులు మాజీ ఎమ్యెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 63 వేలకు పైగా సంతకాలు సేకరించారు.

● నందికొట్కూరు నియోజకవర్గంలో సమన్వయకర్త దారా సుధీర్‌ అధ్వర్యంలో 50 వేల మంది నుంచి పార్టీ నేతలు ఊరూరా సంతకాలు సేకరించారు.

పేదల కలలపై విషం చిమ్మి.. వైద్య విద్యను దూరం చేసి..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఐదింటిని ప్రారంభించి 750 మెడికల్‌ సీట్లను ప్రభుత్వం అదనంగా విద్యార్థులకు అందించింది. అయితే ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబు నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కాలేజీలపై విషం చిమ్మటం మొదలుపెట్టారు. కాలేజీల ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఎక్కడ పేదల పిల్లలు వైద్యులుగా తయారవుతారనన్న దురుద్దేశంతో కాలేజీలను ప్రైవేటీకరణ చేపట్టేందుకు పూనుకున్నారు. కళాశాలను పీపీపీ పేరుతో బినామీలకు కట్టబెట్టి సీట్లు అమ్ముకుని పేదలను దోచుకునే కుట్రకు పదునుపెట్టారు. ఇదే కాకుండా బోధనాసుపత్రులను ప్రైవేటు పరం చేస్తే పేదలకు ఉచిత నాణ్యమైన వైద్యం కూడా అందకుండా చేయవచ్చనే దురాలోచనకు తెర లేపారు. చంద్రబాబు కక్షపూరిత విధానాల ద్వారా రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 2,450 ఎంబీబీఎస్‌ సీట్లను కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. చంద్రబాబు గత 17 నెలల పాలనలో చేసిన రూ. 2.50 లక్ష కోట్ల అప్పులో మెడికల్‌ కళాశాలకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేయలేకపోవడంపై జనం తీవ్రంగా విమర్శిస్తున్నారు.

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనం

కోటి సంతకాల సేకరణకు

అనూహ్య స్పందన

ప్రభుత్వ తీరును నిరసిస్తూ

స్వచ్ఛందంగా సంతకాలు

జిల్లా వ్యాప్తంగా 3.83 లక్షలకు పైగా

సంతకాల సేకరణ

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కోటిసంతకాల సేకరణకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. జిల్లాలో దాదాపు 4 లక్షల మంది సంతకాలు చేశారు. తమ పిల్లల బంగారు భవిష్యత్‌ ఉపయోగపడే మెడికల్‌ కాలేజీలను చంద్రబాబు కార్పొరేట్‌ సంస్థలకు ప్రైవేటీకరణ పేరుతో అప్పగించాలని చూడటం అవివేకమని తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మించిన పథకాలు ఇస్తామంటే నమ్మి మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారు. రాష్ట్రాన్ని ఆర్ధికంగా నిలబెట్టి, పేదలకు సంక్షేమాన్ని అందించే సత్తా ఒక్క వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని ప్రజలు కొనియాడుతున్నారు.

– కాటసాని రాంభూపాల్‌రెడ్డి,

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు

చంద్రబాబు సర్కారు తీసుకున్న అనాలోచితన నిర్ణయాన్ని జనం త1
1/3

చంద్రబాబు సర్కారు తీసుకున్న అనాలోచితన నిర్ణయాన్ని జనం త

చంద్రబాబు సర్కారు తీసుకున్న అనాలోచితన నిర్ణయాన్ని జనం త2
2/3

చంద్రబాబు సర్కారు తీసుకున్న అనాలోచితన నిర్ణయాన్ని జనం త

చంద్రబాబు సర్కారు తీసుకున్న అనాలోచితన నిర్ణయాన్ని జనం త3
3/3

చంద్రబాబు సర్కారు తీసుకున్న అనాలోచితన నిర్ణయాన్ని జనం త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement