కమనీయం.. స్వర్ణ రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. స్వర్ణ రథోత్సవం

Dec 8 2025 7:41 AM | Updated on Dec 8 2025 7:41 AM

కమనీయ

కమనీయం.. స్వర్ణ రథోత్సవం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్రనక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్స వం నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేపట్టారు. స్వర్ణరథోత్సవంలో ముందుగా అర్చకులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు చేశారు. ఉదయం 7.30 గంటలకు స్వర్థ రథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందుభాగం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవం కొనసాగింది. కళాకారుల కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొదలైన కళారూపాలు ఆకట్టుకున్నాయి. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఏవీ రమణ, జి.గంగమ్మ, డి.వెంకటేశ్వర్లు, ప్రత్యేక ఆహ్వానితులు కోటారెడ్డి, ఏఈవో, అర్చకులు, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.

కమనీయం.. స్వర్ణ రథోత్సవం1
1/1

కమనీయం.. స్వర్ణ రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement