పండు కుళ్లిపోతున్నాయి
ఎకరాకు రూ. 45వేలు కౌలు చెల్లించి 8 ఎకరాల్లో అరటి పంటను సాగుచేశాను. తీరా దిగుబడి వచ్చిన తర్వాత మార్కెట్‌లో ధర లేదు. దీంతో పొలాల్లోనే పంటను ఉంచాను. కాయలు మాగిపోయి కుళ్లిపోతున్నా యి. గతంలో నేను టన్ను రూ. 23 వేల వరకు విక్రయించాను. కాని ఇప్పుడు అడిగేవారు లేరు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా కట్టాలో తెలియడం లేదు. – జానవత్ చంద్రానాయక్
కెఆర్‌ఆర్ తండా, పాణ్యం
నేను 5 ఎకరాల్లో అరటి సాగుచేశా. గత నెలలో తుపాన్ నుంచి పంటను కాపాడుకోవడానికి ఎన్నో అవస్థలు పడ్డా. ఎలాగోలా రక్షించుకున్నాం అనే సరికి ధర లేక చెట్లపైనే మాగిపోతున్నాయి. సుమారు రూ. 4 లక్షల దాక పెట్టిన పెట్టుబడిలో ఒక్క రూపాయి కూడా చేతికి రాక ఎంతో నష్టపోయా. చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోవాలి.
– వెంకటరెడ్డి, అరటి రైతు, చిన్నవంగళి
పండు కుళ్లిపోతున్నాయి


