విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించండి
● కర్నూలు, నంద్యాల జిల్లాల ఎస్‌ఈలకు ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారులు నుంచి వస్తున్న వివిధ సమస్యల పరిష్కారానికి కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తోలేటీ ఆదేశించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఏపీఎస్‌పీడీసీఎల్ కార్యాలయం నుంచి డయర్ యువర్ కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆయన రెండు జిల్లాల ఎస్‌ఈలను ఆదేశించారు. డయల్ యువర్ కార్యక్రమానికి 62 మంది వినియోగదారులు పోన్ ద్వారా తమ సమస్యలను వివరించారని వెల్లడించారు. విద్యుత్ వినియోగదారులు డయల్ యువర్ కార్యక్రమానికే కాకుండా టోల్‌ఫ్రీ నంబర్లు 1912 లేదా 1800425155333 నంబర్లకు ఫోన్ చేసి సమస్యలు చెప్పవచ్చని సూచించారు. 91333 31912 నంబరుకు వాట్సాఫ్ ద్వారా కూడా సమస్యలను చాట్ చేయవచ్చని సూచించారు.


