పోతిరెడ్డిపాడు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
జూపాడుబంగ్లా: నెల రోజుల నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లను మూసివేసి ఎన్‌సీఎల్ ద్వారా కేవలం 2వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దిగువన ఉన్న రిజర్వాయర్లలో గరిష్టస్థాయి నీటిమట్టం ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు గేట్లను మూసి ఎన్‌సీఎల్ నుంచి నీటిసరఫరా చేస్తున్న ట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికేంద్రంలో మూడు జన్‌రేటర్లను రన్నింగ్ చేయటం ద్వారా 2.5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తూ 2వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నారు. ఈ నీటిని బానకచర్ల నుంచి తెలుగుగంగ కాల్వకు 1,500 క్యూసెక్కులు, కేసీఎస్కేప్ కాల్వకు 300 క్యూసెక్కులు, గాలేరునగరి కాల్వకు 200 క్యూసెక్కుల నీటిని సరఫ రా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు.


