ఇవీ కష్టాలు..
● మండలంగా ఏర్పాటు కాని జలదుర్గం
● హామీని మరిచిన సీఎం చంద్రబాబు
● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
డోన్: నంద్యాల జిల్లాలో అతిపెద్ద మండలమైన ప్యాపిలిని విభజించి జలదుర్గం కేంద్రంగా మరో మండలాన్ని ఏర్పాటు చేస్తానని ప్రజలకు గత ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర్ర అయినా ఇప్పటి వరకు జలదుర్గాన్ని మండలంగా ప్రకటించలేదు. ఇటీవల కొన్ని ప్రాంతాలను మండలాలుగా ప్రకటించారు. సుమారు 10వేల జనాభా, 6 వేలకు పైగా ఓటర్లు ఉన్న జలదుర్గం మేజర్ పంచాయతీని మండల కేంద్రం అవుతుందని ప్రజలు ఆశించారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్దహరివణాన్ని ఆదోని నుండి విడదీస్తూ ప్రత్యేక మండలంగా ప్రకటించి జలదుర్గంను పట్టించుకోలేదు.
టీడీపీ కుట్ర
జలదర్గంను మండల కేంద్రంగా చేసేందుకు అనువైన ప్రదేశమా కాదా, జనాభా, పరిసర గ్రామాల నుంచి ఎంత దూరంలో మండల కేంద్రం ఉంటుంది అనే అంశాలపై తగిన ప్రతిపాదనలు తయారు చేసి ఆర్‌డిడీఓ నరసింహులు నేతృత్వంలో ప్రభుత్వానికి పంపారు. ఇందుకోసం జలదుర్గంలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలు, భవనాలను కూడా పరిశీలించారు. సర్వే పంపి మూడు నెలలు అవుతోంది. అయితే జలదుర్గం మండల కేంద్రం కాకూడదని టీడీపీలోని ఒక వర్గం పావులు కదుపుతున్నట్లు తెలిసింది. డబుల్ లైన్ రోడ్లతో పాటు హుసేనాపురాన్ని మండల కేంద్రంగా చేస్తే పరిసర గ్రామాలన్నీ పది కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయని టీడీపీ నేతల్లో కొందరు అధిష్టానం దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. టీడీపీలోని ఒక బలమైనవర్గం జలదుర్గం మండల కేంద్రం కాకుండా అడ్డుకున్నట్లు తెలిసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి జలదుర్గాన్ని మండల కేంద్రంగా చేయాలని టీడీపీ నేతలు చెప్పలేదు.
జలదుర్గం 25 గ్రామాలకు
అనుకూలంగా ఉంది.
ప్రజలు 20 నుంచి 40 కిలోమీటర్ల దూరం
లో ఉన్న ప్యాపిలికి వెళ్లాల్సి వస్తోంది.
కొండమీది గ్రామాలైన బూరుగల, బోంచెరువుపల్లె, సీతమ్మతండా, రాచెర్ల, అలేబాద్‌తండా, మునిమడుగు, బోంచెరువుపల్లె తండా, కొమ్మేమర్రి, సిద్దనగట్టు, గార్లదిన్నె, ఊటకొండ, హుసేనాపురం, యజ్ఞరామాపురం, కౌలపల్లె గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఇవీ కష్టాలు..
ఇవీ కష్టాలు..


