శివస్వాముల పాదయాత్రకు అడ్డంకి!
ఆత్మకూరు: వెంకటాపురం గ్రామం నుంచి నల్లమల అడవిలో శివస్వాములు పాదయాత్రను అటవీశాఖ సిబ్బంది శుక్రవారం అడ్డుకున్నారు. దీంతో వంద మంది శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్టు అధికారుల తీరుకు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా శివస్వాములు మాట్లాడుతూ.. దశాబ్దాల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని ఫారెస్టు అధికారులు అడ్డుకోవడం ఏమిటన్నారు. తమ పాదయాత్రను ఆపితే ఇక్కడే కూర్చొంటామని హెచ్చరించారు. వెంకటాపురం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఆత్మకూరు సీఐ రాము అక్కడికి చేరుకుని శివభక్తులతో మాట్లాడారు. అలాగే ఫారెస్టు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. శనివారం ఉదయం 5 గంటలకు శివభక్తులు అటవీ ప్రాంతం గుండా శ్రీశైలానికి వెళ్లడానికి అనుమతినిచ్చారు.


