అప్రెంటిషిప్‌కు 4న ధ్రువపత్రాల పరిశీలన
నంద్యాల(న్యూటౌన్): ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటిషిప్ చేసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్ 4న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని నంద్యాల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాదరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్హత, కుల, ఆధార్, ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు కర్నూలులోని ట్రైనింగ్ కాలేజీలో హాజరు కావాలని తెలిపారు.
జనవరి 29, 30 తేదీల్లో జాతీయ సదస్సు
శ్రీశైలంప్రాజెక్ట్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జనవరి 29, 30వ తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.హుస్సేన్‌బాషా తెలిపారు. కళాశాలలో బుధవారం బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కళాశాల వాణిజ్య విభాగం, న్యూఢిల్లీకి చెందిన ఐసీఎస్‌ఎస్‌ఆర్ సంయుక్త ఆధ్వర్యంలో ‘డిజిటల్ యుగంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాత్ర– గ్రామీణ భారత సాధికారత’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. పత్రాల సమర్పణను జనవరి 10వ తేదీలోగా ధ్రువీకరణ ఇవ్వాలన్నారు.
ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): యూపీపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగ్గయ్య ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. నంద్యాల జిల్లాకు చెందిన అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం కార్యాలయంలో బయోడేటాతో పాటు రెండు ఫొటోలు, కుల, ఆదాయం, ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు, పాన్‌కార్డు, జిరాక్స్ కాపీలను ఈనెల 29లోగా ఇవ్వాలని తెలిపారు.
స్పోర్ట్స్ కోటాను
వినియోగించుకోవాలి
ఆళ్ళగడ్డ: విద్యార్థులు క్రీడల్లో రాణించి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందవచ్చని నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్‌రెడ్డి తెలిపారు. అహోబిలంలో ఎస్‌జీఎఫ్–69 క్రీడా పోటీలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం వస్తుందని, స్నేహ సంబంధాలు మెరుగుపడతాయన్నారు క్రీడా పోటీలకు 500మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు విశ్వనాథ్, ఆశాజ్యోతి, ఏపీఎస్‌ఏపీ గౌరవ అధ్యక్షులు ఏపీ రెడ్డి, నాగరాజు, బేస్‌బాల్ సౌత్‌జోన్ చైర్మన్ నాగరాజు పాల్గొన్నారు.
అప్రెంటిషిప్‌కు 4న ధ్రువపత్రాల పరిశీలన


