అన్నదానం.. వెల్లివిరిసిన సామరస్యం
అయ్యప్పస్వామి
భక్తులకు అన్నదానం చేస్తున్న ముస్లింలు
ముత్యాలపాడు గ్రామంలోని అంకాళమ్మ గుడి వద్ద బుధవారం వైఎస్సార్‌సీపీ నాయకుడు డాబుగాళ్ళ పెద్ద మాబు, అతని సోదరుడు ఉపాధ్యాయుడు మహబుబ్‌బాషాలు.. అయ్యప్ప మాల ధరించిన 50 మంది భక్తులకు భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలు మాట్లాడుతూ.. ముత్యాలపాడు గ్రామంలో కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసి సఖ్యతగా జీవిస్తున్నామన్నారు. గురుస్వామి బోయిని శ్రీనివాసులు మాట్లాడతూ.. ప్రతి ఏడాది అయ్యప్ప భక్తులకు ముస్లింలు భిక్ష ఇస్తున్నారన్నారు. ఈ ఏడాది కూడా భిక్ష ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు శేషురమేష్, అంకాల్‌రెడ్డి, సుబ్బారాయుడు, రజమ్మగారి చాంద్‌బాషా, ఎంపీటీసీ సభ్యుడు నాగ వెంకట రాముడు పాల్గొన్నారు.
– చాగలమర్రి


