రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్‌ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్‌ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి

Nov 27 2025 7:29 AM | Updated on Nov 27 2025 7:29 AM

రాష్ట

రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్‌ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి

కర్నూలు(అగ్రికల్చర్‌): గ్రామస్థాయిలో ఒకవైపు మూగజీవులకు వైద్య సేవలు అందిస్తూ... మరోవైపు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న నాన్‌ గ్రాడ్యుయేట్‌ వెటర్నేరియన్స్‌ను కించపరిచే విధంగా ప్రకటనలు చేస్తున్న రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పీవీ లక్ష్మయ్యపై చర్యలు తీసుకోవాలని ఏపీ నాన్‌ గ్రాడ్యుయేట్‌ వెటర్నేరియన్స్‌ పెడరేషన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అనే పదం వాడే అర్హత నాన్‌ గ్రాడ్యుయేట్‌ వెటర్నేరియన్‌కు లేదని అవమానకరంగా మాట్లాడటం సరికాదన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని గోకులం సమావేశ మందిరంలో జీవీవో, వీఎల్‌వో, ఎల్‌ఎస్‌ఏ కార్యావర్గ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పశుసంవర్ధక శాఖలో ఏహెచ్‌ఏ పోస్టుల భర్తీ పారదర్శకంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే జరిగిందని, ఎంపికై న వారికి డిపార్టుమెంటు అధికారులే డివార్మింగ్‌, వాక్సినేషన్‌, కృత్రిమ గర్భధారణ తదితర వాటిల్లో శిక్షణ ఇచ్చారన్నారు. అయితే, దొంగ సర్టిఫికెట్‌లతో ఉద్యోగాలు పొందారని కించపరచడం తగదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో అధికారులు, నాన్‌ గెజిటెడ్‌ కేడర్ల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కౌన్సిల్‌ చైర్మన్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.అనంతరం పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్‌ హేమంత్‌కుమార్‌కు వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో వివిద సంఘాల నాయకులు జనార్ధన్‌రెడ్డి, గంగన్న,ఆయేశ్వరీ, హనుమంతు, సులోచన, సుమలత తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ఆళ్లగడ్డ: మండలంలోని చింతకొమ్మదిన్నె గ్రామ శివారులో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ముత్తలూరు నుంచి చాగలమర్రికి వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుకవైపు నుంచి లారీ ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్టర్‌ యజమాని మహేశ్వరరెడ్డి, డ్రైవర్‌ వెంకటయ్య గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఫ్లోరోసిస్‌పై అవగాహన

కల్లూరు: ఫ్లోరోసిస్‌పై అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక జిల్లా సంచార కార్యక్రమ అధికారి డాక్టర్‌ రఘు సూచించారు. బుధవారం కల్లూరు పీహెచ్‌సీ పరిధిలోని బొల్లవరం ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌లో ఏర్పాటు చేసిన సంచార చికిత్స కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. హై ఫ్లోరైడ్‌ టూత్‌పేస్ట్‌, నిల్వ ఉండే చిరుతిళ్లు, శీతల పానీయాలు, రెడీమేడ్‌ చిప్స్‌, ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాల్లో అధికంగా ఫ్లోరైడ్‌ ఉంటుందన్నారు. వైద్యులు మోతిలాల్‌నాయక్‌, హెచ్‌ఎం సునీల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

లారీ బోల్తా

రుద్రవరం: వడ్ల బస్తాల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం లారీ మండల కేంద్రమైన రుద్రవరానికి సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే..గుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వైపు నుంచి సుమారు 150 బస్తాల వరి ధాన్యం లోడుతో లారీ నంద్యాలకు బయలు దేరింది. మార్గ మధ్యంలో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ గాయ పడగా స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు

దేవనకొండ: చదువుకోవడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. మండలంలోని కప్పట్రాళ్ల గ్రామంలో పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని మైమూన్‌ మొదట విడతలోనే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్‌ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సులో సీటు సాధించింది. కప్పట్రాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆకె రవికృష్ణ ఈ విషయం తెలుసుకొని ఆ విద్యార్థినిని బుధవారం విజయవాడలోని తన కార్యాలయానికి పిలుపించుకొని అభినందించారు. బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సు నాలుగేళ్లు చదివేందుకు అయ్యే ఖర్చును బొమ్మిడాలా ట్రస్ట్‌ సమకూర్చుతుందని, బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్‌ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి1
1/2

రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్‌ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి

రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్‌ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి2
2/2

రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్‌ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement