నష్టాన్ని దిగమింగుతూ.. కష్టాన్ని దున్నేస్తూ
సి.బెళగల్: ఉల్లి రైతుల గోడు వర్ణనాతీతం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉల్లి ధరలు పడిపోయి పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొనడంతో కోతకు వచ్చిన పంటను కొందరు మూగజీవాలకు వదిలేస్తుండగా.. మరికొందరు పొలంలోనే దున్నేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో ఉల్లి రైతులు ఈ దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నా చంద్రబాబు సర్కారు పట్టనట్లు వ్యవహరిస్తోంది. సి. బెళగల్ మండల పరిధిలోని మారందొడ్డిదొడ్డి గ్రామానికి చెందిన మహబూబ్‌బాష అనే రైతు ఖరీఫ్ సీజన్‌లో రెండెకరాల్లో ఉల్లి సాగు చేశాడు. పెట్టుబడుల కింద దాదాపు రూ. 2.5 లక్షలు ఖర్చుచేశాడు. ధర లేకపోవడంతో కోతకోసి విక్రయిస్తే కూలీల ఖర్చులు కూడా రావని బుధవారం పొలంలోనే పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు.


