ఖాతాదారులకు మెరుగైన సేవలు
జూపాడుబంగ్లా: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పనిచేస్తోందని ఆ బ్యాంక్ చైర్మన్ ప్రమోద్‌కుమార్‌రెడ్డి, రీజనల్ మేనేజర్ పీవీ రమణ అన్నారు. బుధవారం మండలంలోని పారుమంచాల గ్రామంలో ఏపీబీజీ శాఖ నూతన భవనాన్ని వారు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామీణ బ్యాంకుల బలోపేతం కోసం రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు, సప్తగిరి, చైత న్య, వికాశ్ గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 1,351శాఖలు కలిగిన తమ బ్యాంక్ 1.30 కోట్ల మంది ఖాతాదారులతో రూ.1,28,000 కోట్ల టర్నోవర్‌తో దేశంలోనే రెండో అతి పెద్ద బ్యాంక్‌గా కొనసాగుతుందన్నారు. బ్యాంకుల విలీనం ద్వారా ఏర్పడిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఖాతాదారుడు ఎన్ని బ్యాంకు నెంబర్లు కలిగి ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఓ సెల్‌నెంబర్ ఉండాలన్నారు. ప్రస్తుతం తమ బ్యాంకు ద్వారా డ్వాక్రా, పంట, గోల్డ్, విద్యారుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులకు వ్యవసాయ పనిముట్లకు రుణాలు ఇస్తున్నామన్నారు. పారుమంచాల బ్యాంకు ప్రస్తుతం రూ.60 కోట్ల టర్నోవర్‌తో రైతులు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మొండి బకాయిదారులు ఎవ్వరైనా ఉంటే డిసెంబర్ నెలాఖరులోగా వన్‌టైం సెటిల్‌మెంటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రీజనల్ ఆఫీసర్లు ఎస్‌ఎం సాయికిరణ్, రహీం, మేనేజర్లు కిషోర్‌బాబు, చిరంజీవిశ్రేష్టి, సునీల్‌కృష్ణ, మల్లిఖార్జునరెడ్డి, రియాజ్‌బాషా, రైతులు కరుణాకర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.


