విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహం
కర్నూలు (టౌన్) : విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రోత్సాహం అందిస్తుందని జిల్లా విద్యాశాఖా ధికారి శామ్యూల్ పాల్ అన్నారు. బుధవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. పిల్లలకు త్రోబాల్, రన్నింగ్, షాట్‌పుట్ వంటి క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఇటువంటి క్రీడలు దోహదపడతాయన్నారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు క్రీడలు నిర్వహించడం మంచి పరిణామమన్నారు. కర్నూలు మండల విద్యాధికారి అబ్దుల్ రెహెమాన్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం పిల్లల పోటీలను డీఈఓ జెండా ఊపి ప్రారంభించారు.


