● ముళ్ల ఏదును తప్పించబోయి..
రోడ్డుపై అడ్డుగా వచ్చిన ముళ్ల ఏదు (ముళ్లపంది) తప్పించే క్రమంలో ఓ ఏజెన్సీ ఉద్యోగి కింద పడి తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మహానంది సమీపంలో చోటు చేసుకుంది. గోపవరం గ్రామానికి చెందిన కుమార్ రాయల్ మహానంది దేవస్థానంలో ఏజెన్సీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై వెళ్తుండగా జినశంకర తపోవనంలో నల్లమల అడవి నుంచి రోడ్డుపైకి ముళ్ల ఏదు రావడంతో తప్పించబోయి కిందపడ్డాడు. స్థానికులు గమనించి 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదంలో కుమార్ చేతికి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. – మహానంది
● ముళ్ల ఏదును తప్పించబోయి..


