ఇస్తామన్నది ఎంత.. ఇచ్చిందెంత..?
అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20 వేలు అందజేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రకటించారు. రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.10వేలతోనే సరిపెట్టింది. పంట నష్టపరిహారంలో రైతులను నట్టేట ముంచింది. రైతులను మోసం చేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. చంద్రబాబు సర్కారు కౌలు రైతులను పూర్తిగా విస్మరించింది.
– వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
కౌలు రైతుల పట్ల కనికరం లేకుండా చంద్రబా బు సర్కార్ ఎన్నికల అవసరాలు తీరాక అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు విడుదల చేయకుండా రైతులను మోసం చేస్తోంది. కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందించాలి. మోంథా తుపాన్ నష్టపరిహారం కూడా కౌలు రైతులందరికీ వర్తింపజేయాలి. మిగిలిపోయిన కౌలు రైతులందరికీ సీసీఆర్‌సీ కార్డులు అందించి పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.
– రామచంద్రుడు, ఏపీ రైతు సంఘం,
జిల్లా కార్యదర్శి
ఇస్తామన్నది ఎంత.. ఇచ్చిందెంత..?


