అంతన్నారు.. ఇంతన్నారు..
● చిత్రంలో కనిపిస్తున్న కౌలు రైతు పేరు గడ్డం నరసింహుడు. బండిఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామం. 15 ఏళ్లుగా ఐదెకరాలు కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది భూ యజమానికి ఎకరాకు 18 బస్తాలు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే తుపాన్‌తో పంట దెబ్బతినడం, దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి సాయం అందించ లేదు. గత జగనన్న ప్రభుత్వంలో రెండు సార్లు రూ.13,500 రైతు భరోసా కింద సహాయం అందజేసింది. రెండు విడతలుగా పంట నష్ట పరిహారం సైతం రూ.35 వేలు తన ఖాతాలో జమ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వంలో నయాపైసా పడలేదు. ప్రతి కౌలు రైతుకు ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ ద్వారా అందిస్తామన్న చంద్రబాబు హామీ నీటి మూటగా మారింది.


