దెబ్బ మీద దెబ్బ
● ఫొటోలో కనిపిస్తున్న కౌలు రైతు పేరు పబ్బతి జగన్‌బాబు. గోస్పాడు మండలం ఒంటివెలగల గ్రామానికి చెందిన కౌలు రైతు. ఎకరా రూ.40 వేల కౌలుతో ఐదు ఎకరాల్లో మిరప పంట సాగు చేశాడు. మరో 5 ఎకరాల్లో ఎకరాకు రూ.20 వేలు కౌలు చెల్లించి జొన్నపంట సాగు చేశాడు. అయితే మిరప పంట సాగు అయిన నెలలోనే భారీ వర్షాలతో పది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. మొక్కజొన్న అరకొర దిగుబడి రావడంతో తీవ్రంగా నష్టపోయాడు. ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లిస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీని కౌలు రైతులకు అందకపోవడంతో మరింత నష్టపోయాడు.


