శ్రీశైలం ఈఓ కొనసాగింపు | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలం ఈఓ కొనసాగింపు

Nov 26 2025 6:29 AM | Updated on Nov 26 2025 6:29 AM

శ్రీశ

శ్రీశైలం ఈఓ కొనసాగింపు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎం.శ్రీనివాసరావును మరో ఏడాది పాటు ఈఓగా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి డా.ఎం.హరిజవహర్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది డిసెంబరు 5వ తేదీన శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. సంవత్సరం పూర్తి కావస్తుండడంతో ఆయనను మరో ఏడాది (2026 డిసెంబరు 4 వరకు) పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

27న విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు

నంద్యాల(న్యూటౌన్‌): స్థానిక నవజీవన్‌ స్పెషల్‌ స్కూల్‌ పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులకు ఈనెల 27వ తేదీన క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే నెల 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అథ్లెటిక్స్‌ 100, 400 మీటర్లు, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌, బ్యాడ్మింటన్‌, పవర్‌ లిఫ్టింగ్‌, వాలీబాల్‌ పోటీలను నిర్వహిస్తామన్నారు. మరింత సమాచారం కోసం 8712622576ను సంప్రదించాలన్నారు.

శ్రీశైలంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు

శ్రీశైలం: దేవస్థానం పరిధిలోని టోల్‌గేట్‌ వద్ద వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. వన్‌టౌన్‌ సీఐ ప్రసాద్‌రావు తన సిబ్బంది, దేవస్థానం సెక్యూరిటీ గార్డ్‌లతో కలిసి మంగళవారం ఉదయం వాహనాల తనిఖీ చేపట్టారు. జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌, ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయ నాయక్‌ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ చేపట్టినట్లు సీఐ తెలిపారు. దేవదాయ చట్టం నిబంధనల మేరకు క్షేత్రంలోకి మద్యం, మాంసం, సిగిరెట్‌, గుట్కాలు తదితర నిషేధిత పదార్థాలు రాకుండా చర్యలు చేపట్టామన్నారు. అలాగే అన్యమత స్టిక్కర్లు కలిగి ఉన్న వాహనాలను కూడా తనిఖీ చేసి వాటిని తొలగించి క్షేత్రంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు.

రాజీ అయ్యేలా అవగాహన కల్పించండి

నంద్యాల (వ్యవసాయం): రాజీ కాగల కేసులను గుర్తించి, ఆ మేరకు కక్షిదారుల్లో అవగాహన కల్పించాలని మూడవ అదనపు కోర్టు జిల్లా జడ్జి, లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ అమ్మన్నరాజా పోలీసు అధికారులకు సూచించారు. 3వ అదనపు కోర్టు ఆవరణలో మంగళవారం ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసులు, ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ లక్ష్మీ, డీఎస్పీ మందా జావలితో పాటు పోలీసు, ఎకై ్సజ్‌ అధికారులతో ఆయన లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి అమ్మనరాజా మాట్లాడుతూ.. డిసెంబర్‌ 13వ తేదీన నిర్వహించే మెగా జాతీయ లోక్‌అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారానికి అందరూ చొరవ తీసుకోవాలన్నారు. పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసుల్లో రాజీ అయ్యే వాటిని గుర్తించి పరిష్కరించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పీపీ శ్రీనివాసులు, సీఐలు, ఎస్‌ఐలు, ఎకై ్సజ్‌ అధికారులు, పోలీసులు, లోక్‌ అదాలత్‌ సిబ్బంది రామచంద్రారెడ్డి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల మహా క్షేత్రంలో మార్గశిర శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని బుధవారం సుబ్రహ్మణ్యషష్ఠి మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు. లోక కల్యాణం కోసం జరిపే ఈ ఉత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి (కుమారస్వామి) ఉదయం 7 గంటలకు విశేష అభిషేకం, అర్చనలు జరిపిస్తారు. 9 గంటల నుంచి సుబ్రహ్మణ్య హోమం, పూర్ణాహుతి చేస్తారని వివరించారు.

శ్రీశైలం ఈఓ కొనసాగింపు 1
1/1

శ్రీశైలం ఈఓ కొనసాగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement