‘విజయ’ దరహాసం
ఆళ్లగడ్డ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం పులివెందులలో ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, కర్నూలు మిల్క్ యూనియన్ చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి, విజయసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రుద్రవరం మండలం మాచినేనిపల్లె పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సంహకార సంఘం ఎన్నికల్లో పాల సొసైటీల అధ్యక్షులుగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులు ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి, జెల్లయ్య ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారిని అభినందించారు. అనంతరం ఆళ్లగడ్డ నియోజవర్గ పరిస్థితులపై చర్చించారు.


