కేసీ కింద రబీ లేనట్టే!
● కాల్వలో తగ్గిన నీటి సరఫరా
జూపాడుబంగ్లా: కేసీ కాల్వ కింద రబీ పంటలకు సాగునీరు సరఫరా చేసే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం కాలువకు సాగునీటి సరఫరా తగ్గింది. సుంకేసుల జలాశయం నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. లాకిన్స్‌లా వరకు 864 క్యూసెక్కుల నీరు వస్తోంది.అందులో నిప్పులవాగుకు 578, తూడిచెర్ల సబ్‌చానల్‌కాల్వకు 256, ఏబీఆర్ కాల్వకు 30 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. కేసీ కాల్వ కింద రబీ పంటలకు సాగునీరు సరఫరా చేస్తామని ఇప్పటి వరకు అధికారులు ప్రకటించలేదు. ఈ విషయంపై టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టత ఇవ్వలేదు. మొత్తంగా కేసీ కాల్వ ఆయకట్టు కింద రబీ పంటలకు సాగునీరు సరఫరా చేసే అవకాశాల్లేవనే సంకేతాలు కనిపిస్తున్నారు. ఈ విషయమై రైతులు అప్రమత్తం కాకపోతే రబీపంటలు సాగుచేసి తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.


