పాలకేంద్రం ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జయకేతనం
● టీడీపీకి తప్పని పరాభవం
● భగ్నమైన అధికార పార్టీ నేతల కుట్రలు
● వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల
ఏకగ్రీవ విజయం
ఆళ్లగడ్డ: టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలు పటాపంచలు అయ్యాయి. పాలకేంద్రం ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఏకగ్రీవంగా విజయం సాధించారు. దీంతో వైస్సార్‌సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండలం మాచినేనిపల్లె పాల ఉత్పత్తిదారుల పరస్పర సహయక సహకార సంఘ ఎన్నిలక్లో టీడీపీకి భంగపాటు ఎదురయ్యింది. పాల సొసైటీలు అధ్యక్షులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎస్‌వీ జగన్‌మోహనరెడ్డి, జెల్లయ్య ఏకగ్రీవంగా విజయం సాధించారు. సోమవారం మాచినేనిపల్లె పాలకేంద్రం ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించేందుకు విజయా డెయిరీ ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. టీడీపీ అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్లను ఆపాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులందరినీ మాచినేనిపల్లె చుట్టుపక్కల మోహరింపజేశారు. నామినేషన్ వే సేందుకు వస్తే అడ్డుకోవాలని, అవసరమైతే దాడులు చేసేందుకు కూడా వెనుకా డవద్దని టీడీపీ నేతలు ఆదేశాలు ఇచ్చారు. భారీ ఎత్తున పోలీస్‌బలగాలు మోహరించడం, పైన డ్రోన్లు తిరిగడంతో టీడీపీ నేతలు కుట్రలు పటాపంచలు అయ్యాయి. పాల సొసైటీలు అధ్యక్షులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎస్‌వీ జగన్‌మోహనరెడ్డి, జెల్లయ్య ఏకగ్రీవం అయ్యారు. మాచినేనిపల్లెతో పాటు జిల్లాలోని 21 సంఘాల అధ్యక్షుల నామినేషన్ల ప్రక్రియ నిర్వహించగా ఇందులో డబ్ల్యు గోవిందిన్నె, డబ్యు కొత్తపల్లె, గుండుపాపల, బోయలకుంట్లమెట్ట, గాంధీనగర్ అనే ఐదు సంఘాల నామినేషన్లు వాయిదా పడ్డాయి.
పాలకేంద్రం ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జయకేతనం


