17 క్వింటాళ్లు అమ్ముకోలేని పరిస్థితి
గత ఏడాది 3 ఎకరాల సొంత పొలంలో శనగ పంట సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20 వేల వరకు వెచ్చించాను. వాతావరణం అనుకూలించక మూడు ఎకరాలకు సంబంధించి 17 క్వింటాళ్ల దిగబడులు వచ్చాయి. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక దిగుబడులను గోదాములో భధ్రపరుచుకుని ధర కోసం ఎదురు చూస్తున్నాను.
– లక్ష్మినారాయణ, రైతు,
కలుగొట్ల, కోవెలకుంట్ల మండలం
గత ఏడాది మూడు ఎకరాల సొంత పొలంతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని శనగ సాగు చేశాను. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎకరాకు నాలుగు బస్తాల దిగబడులే వచ్చాయి. మార్కెట్‌లో ధర లేకపోవడంతో ఇప్పటి వరకు దిగుబడులు గోదాములోనే ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ రెండో వారంలో శనగ సాగు చేయగా మోంథా తుఫాన్ ప్రభావంతో విత్తనం కొట్టుకపోయింది. ఆ స్థానంలో ఇటీవల రెండవసారి విత్తనం వేయాల్సి వచ్చింది. శనగకు మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి.
– వెంకటేశ్వర్లు, రైతు,
జోళదరాశి, కోవెలకుంట్ల మండలం
17 క్వింటాళ్లు అమ్ముకోలేని పరిస్థితి


