
చంద్రబాబూ... కక్ష పూరిత రాజకీయాలు మానుకో
కర్నూలు (టౌన్): సీఎం చంద్రబాబు నాయుడు కక్ష పూరిత రాజకీయాలు మానుకోవాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి హితవు పలికారు. అక్రమ కేసులు, అరెస్ట్‌లతో వేధింపులకే పాల్పడితే ప్రజలు తిరగబడతారన్నారు. శనివారం స్థానిక కల్లూరులోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతి రేక విధానాలపై 13 నెలలుగా వైఎస్సార్‌సీపీ చేస్తున్న ప్రజా పోరాటాలతో చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. రాష్ట్రాన్ని దోపీడీ చేసేందుకు ఎవరూ అడ్డు రాకూడదనే దుర్దేశంతో వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారన్నారు. లిక్కర్ కేసు ఓ బోగస్ కేసు అని, కేవలం జగనన్న చుట్టూ ఉండే ముఖ్య నేతలను ఇబ్బందులు పెట్టడమే కూట మి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏడాదిగా అమాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా చేస్తున్న డ్రామాలు అని ప్రజలకు తెలిసి పోయిందన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేయడం చేతకాక ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం చిన్న స్థాయి ఉద్యోగులను బెదిరించి భయపెట్టాలని చూస్తుందన్నారు. మొదట్లో రూ. 50 వేల కోట్ల స్కామ్ అంటూ, ఆ తర్వాత రూ. 2 వేలు అంటూ కట్టు కథలు అల్లుతున్నారన్నారు. అక్రమ అరెస్ట్‌లు చేయించి కూటమి నేతలు పైశాచిక ఆనందం పొందుతుందన్నారు. చంద్రబాబు కుట్రలకు భయపడేది లేదని, వైఎస్సార్‌సీపీ నాయకులు దీటుగా ఎదుర్కొంటారన్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభు త్వం అభాసు పాలయ్యిందన్నారు.
లిక్కర్ కేసు అంతా బోగస్
అక్రమ అరెస్ట్‌లతో పైశాచిక ఆనందం
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి