
ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
నంద్యాల(న్యూటౌన్): నంద్యాల జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మైనార్టీ, న్యాయ, సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో ‘స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ట్లాడుతూ అధికా రులు, సిబ్బంది సమన్వయంతో నంద్యాలను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దాలన్నారు. డిస్పోజబుల్ గ్లాసులు వినియోగానికి అడ్డుకట్ట వేయాలని, వీటిపై పోలీస్, మున్సిపల్ యంత్రాంగం దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజబుల్ గ్లాసులు పూర్తిగా నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. వాటికి ప్రత్యామ్నాయ జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ వినియోగాన్ని పెంచాలన్నారు. అనంతరం మంత్రి, కలెక్టర్ కొందరికి జూట్ బ్యాగ్‌లు అందజేశారు.