
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కోవెలకుంట్ల: పట్టణంలోని ఇండోర్‌స్టేడియం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. కోవెలకుంట్ల ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. ఉయ్యాలవాడ మండలం బోడెమ్మనూరుకు చెందిన అల్లూరి ప్రభాకర్, చెన్నమ్మ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్తకు దూరమై 15 సంవత్సరాల క్రితం పిల్లలతో సహా ఆమె కోవెలకుంట్లలో స్థిరపడింది. పట్టణంలోని ఓ మార్ట్‌లో తల్లితోపాటు కుమారుడు ధరణికుమార్(20) గుమాస్తాలుగా పనిచేస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో ఆ యువకుడు జమ్మలమడుగు చౌరస్తా నుంచి బైక్‌పై పట్టణంలోకి వస్తూ లారీ టైర్ల కింద పడ్డాడు. భారీ వాహనం కావడంతో శరీరభాగాలు నుజ్జయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. వంద మీటర్ల దూరంలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్‌లో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న మంత్రి సంఘటన స్థలానికి చేరుకుని ప్ర మాద వివరాలను సీఐ హనుమంతునాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. ఒక్కగానొక్క కుమారు డు మృతి చెందటంతో తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
డిగ్రీ కళాశాలలోకి వర్షపునీరు
పాణ్యం: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలోని తరగతి గదుల్లోకి శనివారం వర్షపునీరు వచ్చి చేరింది. జోరు వాన కురవడం, కళాశాలకు కేటాయించిన గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ దుస్థితి నెలకొంది. తరగతి గదిలోకి వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
‘రైతుసేవ’లు మూత
ఆలూరు రూరల్: అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన రైతుసేవా కేంద్రాలు మూతపడ్డాయి. ఆలూరు మండలంలోని హత్తిబెళగల్, కమ్మరచేడు, కురుకుంద, మనేకుర్తి, కురువళ్లి, హులేబీడు గ్రామాల్లో ఈ కేంద్రాలు పనిచేయడం లేదు. ఇటీవల ఈ కేంద్రాలకు బదిలీపై వచ్చిన ఎవ్వరూ చేరకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఖరీఫ్‌లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేసి అవసరమైన ఎరువులు అందుబాటులో లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. అయినా రైతుసేవా కేంద్రాలను అధికారులు అందుబాటులోకి తీసుకురావడం లేదు.
రేపటి నుంచి ప్రకృతి సేద్యంపై వీఏఏలకు అవగాహన
కర్నూలు(అగ్రికల్చర్):ఈనెల 21 నుంచి మూడు రోజుల పాటు రైతు సేవ కేంద్రాల ఇన్‌చార్జీలకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించనున్నట్లు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మాధురి తెలిపా రు. అన్ని వ్యవసాయ శాఖ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించే ఈ సదస్సుల్లో ఎంపిక చేసిన వీఏఏలకు మాత్రమే మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. ప్రతి డివిజన్‌కు మాస్ట ర్ ట్రైనర్లను నియమించామని, ఆయా మండ లాల వ్యవసాయ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం